పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ల్యాబ్స్ యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)లో భాగంగా రూ.75లక్షలు వెచ్చించి పరిసర గ్రామాల్లోని 12వేల కుటుంబాలకు పంచేందుకు 8రకాల నిత్యావసర సరకులతోకూడిన కిట్లను సమకూర్చింది. వీటి పంపిణీని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం కంపెనీలో ప్రారంభించారు. అనంతరం సంస్థ హెచ్‌ఆర్ ఉపాధ్యక్షుడు చావ నర్సింహారావు జీవీఎంసీ కమిషనర్ సహాయనిధికిగాను రూ.10లక్షల చెక్కును ఎంపీకి అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు
ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ప్రభుత్వానికి తనవంతు సహాయంగా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ పి.ఎస్.అవధాని రూ.లక్ష, ఏయూ విశ్రాంత ఉద్యోగి కె.సావిత్రి రూ.50వేలు విరాళం ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డికి అందించారు.
75 లక్షలతో నిత్యావసరాలు