పెరిగిన టోల్‌గేట్‌ ఛార్జీలు

కాగిత టోల్‌గేట్‌ వద్ద వాహనాల నుంచి ఫీజు వసూలు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో నెలరోజుల పాటు ఫీజు వసూలు చేయకుండా వాహన యజమానులకు వెసులుబాటు కల్పించిన కేంద్రం, తిరిగి ఫీజు వసూలుకు ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సిబ్బంది వాహనాల నుంచి ఫీజు తీసుకుంటున్నారు. చిన్న వాహనాలకు రూ. 5, పెద్ద వాటికి రూ. 10 ఛార్జీలు పెరిగాయని ప్లాజా మేనేజరు పలివెల వెంకటరమణ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఫీజుల వసూలు ఆపాలని వైకాపా అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్‌ కోరారు. తాజంగి డీఆర్‌డిపో వద్ద సోమవారం గిరిజనులు భౌతిక దూరం పాటిస్తూ వరుసలో నిల్చున్నారు. ఉచిత బియ్యం, సెనగల కోసం ఆదివారం తోపులాట చోటుచేసుకుంది. దీంతో చింతపల్లి ఏఎస్పీ సతీష్‌కుమార్‌, చింతపల్లి ఎంపీడీఓ ప్రేమాకరరావు చొరవ తీసుకున్నారు. డిపోల వద్ద నియమించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.